పోలీస్ కస్టడీలోకి నూతన్ నాయుడు

బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్‌ నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు.