ఇంగ్లాండ్ బయలుదేరిన పాక్ క్రికెటర్లు

ఇంగ్లాండ్‌లో పర్యటించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం పాక్‌ జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు బయలుదేరింది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు పాక్‌ ఆటగాళ్లందరికీ స్వదేశంలోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిన వారిని ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు అనుమతించారు.

20 మంది సభ్యుల బృందం ఇంగ్లాండ్‌లోని వోర్సెస్టర్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటుంది. ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లో పాక్‌ తలపడనుంది. ఇక ఇప్పటికే వెస్టిండీస్‌ క్రికెట్ టీమ్‌ ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. క్వారంటైన్‌ పూర్తైన తర్వాత కరీబియన్‌ టీమ్‌ టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధమవుతోంది.