దావూద్ ఇబ్రహీంతో కమిటైన హీరోయిన్ ఈమె !

గ్యాంగ్ స్టర్, 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ తెలిసిందే. ఆయన పాక్ సినీనటితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడట. మెహవిష్ హయత్ అనే 37 ఏళ్ల నటితో యవ్వారం నడిపాడట. 2009లో చిన్న పాత్రలు పోషించుకుంటూ పొట్ట పోసుకునే స్థితిలో ఉన్న మెహవిష్ హయత్ కు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘తమ్ గా ఏ ఇంతియాజ్’ అవార్డును ప్రకటించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది.

ఆమెకు అవార్డు రావడం వెనుక దావూద్ ప్రమేయం ఉందని, ఆయన గట్టి సిఫార్సుతోనే హయాత్ కు అవార్డు వచ్చిందని తెలుస్తోంది. అప్పటివరకూ మీడియాకు గానీ, పాక్ సినీ ప్రియులకుగానీ పరిచయం లేని ఆమె పేరు, ముఖం, ఆపై ఎంతో పాప్యులర్ అయ్యాయి. ఆమెకు అంతటి అవార్డు రావడం నాడు దేశ సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యపరిచింది.