పాక్ విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే ?

పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణించగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో జుబేర్‌ ఒకరు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జుబేర్.. ప్రమాదానికి ముందు జరిగిన సంఘటలని వివరించారు.

‘పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 8303 విమానం లాహోర్‌ నుంచి సాఫీగానే వచ్చింది. నా సీటు 8ఎఫ్‌. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే.. పైలట్‌ అందర్నీ సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. సరిగ్గా ల్యాండయ్యే సమయానికి విమానం మూడుసార్లు కుదుపులకు గురైంది. రన్‌వేను సమీపించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి పైలట్‌ విమానాన్ని అమాంతం గాల్లోకి పైకిలేపాడు. 10, 15 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాక.. మళ్లీ ల్యాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతలోనే విమానం జనావాసాల మధ్య కుప్పకూలింది. నేను స్పృహ కోల్పోయి కళ్లు తెరిచి చూసేసరికి అక్కడంతా పొగ వ్యాపించింది’ అని జుబేర్‌ వివరించారు