వైసీపీలోకి మరో తెదేపా నేత

ఏపీలో తెదేపా నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రేపు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే పార్టీకి ఆయన రాజీనామా చేశారు.

అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.