ఢిల్లీకి బిగ్ షాక్

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి షాక్ తగిలింది. రిషభ్ పంత్‌ గాయపడ్డాడు. ఫలితంగా వారం కన్నా ఎక్కువ రోజులు అందుబాటులో ఉండడని సమాచారం. శుక్రవారం రాజస్థాన్‌తో తలపడిన మ్యాచులో పంత్‌ గాయపడ్డాడు. అతడి పిక్కలు పట్టేశాయని తెలిసింది. అందుకే ఆదివారం ముంబయి మ్యాచులో ఆడలేదు. ప్రస్తుతం రిషభ్ పంత్‌ పరిస్థితి తెలియదని కెప్టెన్‌ శ్రేయస్‌ అన్నాడు. కనీసం వారం రోజులు అతడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించాడు.

ఈ ఏడాది ఆరు మ్యాచులాడిన పంత్‌ 35.20 సగటు, 133.33 స్ట్రైక్‌రేట్‌తో 176 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 38. గతంలో మాదిరిగా అతడు విజృంభించిన దాఖలాలు ఈ సారి కనిపించలేదు. పంత్‌ తన ఫామ్‌ తిరిగి పొందాలంటే నిరంతరం క్రికెట్‌ ఆడటం ముఖ్యం. గాయపడ్డ తరుణంలో వారం రోజుల పాటు అతడు మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేదు. సాధనా చేయలేడు. దీంతో దిల్లీ యాజమాన్యం తీవ్రంగా ఆందోళన చెందుతోంది.