పార్లే కరోనా సాయం.. మూడు కోట్లు

కరోనా కట్టడి కోసం సాయం చేసేందుకు పలువురుముందుకొస్తున్నారు. ఈ క్రమంలో పార్లే యాజమాన్యం కూడా తన వంతు సాయాన్ని చేసేందుకు ముందుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు.. యాచకులకు ఇబ్బందులు తలెత్తుకుండా.. తమ వంతు సాయంగా మూడు కోట్ల బిస్కెట్ ప్యాకెట్లను అందజేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ పరంగానే వాటిని సప్లే చేయిస్తామని ప్రకటించింది.

ఇక కరోనా సోకి ప్రపంచ వ్యాప్తం 8వేల మంది మృతి చెందారు. మరో నాలుగున్నర లక్షల మంది వరకు పాజిటివ్ కేసులతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంబిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు 41 కరోనా కేసులు నమోదయ్యాయ్. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.