పార్లమెంట్’లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనపై ప్రకటన చేస్తారా?

పార్లమెంట్ సమావేశాల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనపై ప్రకటన చేయబోతున్నట్టు సమాచారమ్. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు కార్యకలాపాలను నిర్ణయించేందుకు ఆదివారం ఏర్పాటు చేసిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి.

జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన గురించి చర్చను నివారించడం కష్టమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

గాల్వన్ లోయలో జూన్ 15న భారత సైనికులపై చైనా సైన్యం దాడి చేసింది. అదేవిధంగా ఆగస్టు 29 రాత్రి కూడా దాడి చేసింది. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపి, 5 అంశాలతో ఓ ప్రణాళికను రూపొందించారు. అయినప్పటికీ ప్రతిష్టంభనకు తెరపడలేదు.