సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇకలేరు

సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేసారు. ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా కొంతకాలం పనిచేసారు. ప్రస్తుతం సురేష్ కొండేటి ‘సంతోషం’ సినీ పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, మెగాస్టార్ చిరజీవి, ఈ తరం వరకు కూడా అందరితోనూ సన్నిహిత సంబంధాన్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబంతో ఆయనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన పుస్తకాలు కూడా రాశారు. ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి 150 సినిమాల ప్రయాణంపై ఈయన రాసిన చిరంజీవితం పుస్తకం చాలా బాగా హైలైట్ అయింది.