ఆయన మార్గంలోనే నా రాజకీయ ప్రయాణం : పవన్

మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి నేడు. ఈ సందర్భంగా కలాంకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఏ కోణంలో చూసినా ఈ తరంలో ఆయన ఒక అద్భుతం అని కీర్తించారు.

“ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా అవతరించారు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా ఒదిగి ఒదిగి జీవించడం ఎందరికి సాధ్యం. ఒక్క కలాం గారికి తప్ప! మిస్సైల్ మాన్ అని కీర్తించినా.. భారత రత్నతో గౌరవించినా వినమ్రునిగానే భాసిల్లారు. కలాం చూపిన మార్గంలోనే నా రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. దేశానికి ఇవ్వడమే తప్ప దేశం నుంచి ఏమి తీసు కోని ఆయన ఔన్నత్యమే నాకు శిరోధార్యం. ఈ రోజు ఆ మహానుభావుని జయంతి. ఈ పర్వదినాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఆయనకు భక్తితో అంజలి ఘటిస్తున్నా” అని పవన్ అన్నారు.