పవన్ ని నిరాశపరిచిన ఢిల్లీ టూర్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హుఠాహుఠిన ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ని భాజాపా పెద్దలు పిలిచారు. కానీ రాగానే హారతులు పట్టలేదు. ఓపికని పరిక్షించారు. పవన్ ని వెయిట్ చేశారు. అయితే పవన్ ఢిల్లీ టూర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం, తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చించేందుకే అనే ప్రచారం జరిగింది.

కానీ బీజేపీ అధిష్టానం మాత్రం అమరావతి టాపిక్ ని తీసుకుందట. మూడు రాజధానుల ఏర్పాటుకు పవన్ అడ్దంకిని తప్పించే ప్రయత్నం చేసినట్టు సమాచారమ్. అంటే.. ? ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోతున్న విషయంలో పవన్ సలైంట్ గా ఉండాలని కోరారట. దాని కంటే ముందే అమరావతి రైతులకి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేయడం.. అందుకు వారు ఓకే అనడం జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే ఏరకంగా అమరావతి రైతులకి న్యాయం చేస్తారన్నది చూడాలి.

Spread the love