పంట నష్టం పరిహారం వెంటనే చెల్లించాలి : పవన్

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు-వరదలు తీవ్ర నష్టం మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారంగా తక్షణమే చెల్లించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. గతేడాది పంటనష్టం ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని, నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా ప్రభావితం అయిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నాయకులు పర్యటించి ముంపులో ఉన్న పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు.