అమిత్ షాని గెలికిన పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊపు మీదున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ తెలుగు సినీ హీరోలు, హిందుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు కూడా పవన్ మాటల టూటాలు పేల్చారు. ఈరోజు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని గెలికారు.

తాను అన్నింటికీ సిద్ద పడి, తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, దేశం కోసం చచ్చిపోయేందుకు సిద్ధమేనన్న పవన్ అన్నారు. ప్రస్తుతం దేశానికి అమిత్‌షా లాంటి వ్యక్తులే కరెక్టని అభిప్రాయపడ్డారు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడుకుని రాజకీయ పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయని పవన్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఓటమి, గెలుపు రెండూ నాకు తెలియదు.. మనస్సాక్షే నాకు భగవంతుడు అన్నారు పవన్.