జగన్ రెడ్డిపై పవన్ తగ్గడం లేదుగా.. !

ఏపీ సీఎం జగన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన్ని జగన్ రెడ్డి అనే సంబోధిస్తున్నారు. ఓట్ల రాజకీయాలు చేయనిరోజు, రైతుల్ని ఇబ్బందిపెట్టని రోజే జగన్‌ను గౌరవిస్తానని, అప్పటి వరకు జగన్‌రెడ్డి అనే పిలుస్తానని పవన్‌ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు.

సీమ నుంచి ఎందరో సీఎంలు అయ్యారు. అయినా ఇక్కడ వెనుకబాటు ఉందన్నారు పవన్. రాయలసీమలో రైతులకు శీతల గిడ్డంగులు కట్టలేక పోయారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్‌ పరిశ్రమలు పెట్టుకునేందుకు కాదన్నారు. రాయలసీమలో రాజకీయ నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయన్నారు. రాయలసీమ పేదలే పొట్ట చేతపట్టుకుని వలసలు వెళ్తున్నారన్నారు. 151 ఎమ్మెల్యేలున్న ప్రభుత్వం కూడా మన గుండెబలానికి భయపడుతోందని విమర్శించారు. ధైర్యమే నా ఖడ్గం అన్నారు పవన్.