పవన్-క్రిష్ సినిమా సెట్ డ్యామేజ్

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ పూర్తయిన తర్వాత క్రిష్ సినిమాని మొదలెట్టాలనే ప్లాన్ లో పవన్ ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం నగరంలోని అల్యూమినియం కర్మాగారంలో భారీ సెట్‌ను నిర్మించారు. సహజంగా సముద్రాన్నినిర్మించడంతో పాటు ఓడ సెట్ కూడా వేశారట. ఎన్నో ప్రత్యేకలతో సెట్‌ని రూపొందించినట్టు తెలుస్తుండగా, రీసెంట్‌గా కురిసిన భారీ వర్షం వలన సెట్ అంతా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది.

ఇప్పుడు సెట్ ని షూట్ కోసం ఉపయోగించలేని స్థితిలో ఉంది. లాక్ డౌన్ కారణంగా మేకర్స్‌కి ఇప్పటికే కోలుకోలేని నష్టం జరుగగా, తాజాగా కురిసిన వర్షంతో ప్రొడక్షన్ సంస్థ కి భారీ నష్టాలు వాటినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లని లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా.. సెట్స్ మీదకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో భారీ వర్షం పవన్ సినిమాకి భారీ డ్యామేజ్ చేసినట్టు తెలుస్తోంది. కోట్లలోనే నష్టం వాటిల్లినట్టు తెలిసింది.