పవన్ కర్నూలు పర్యటన ప్రారంభం

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన మొదలైంది. పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర పవన్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో పవన్‌ ర్యాలీలో పాల్గొననున్నారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులను శిక్షించాలంటూ పవన్ ర్యాలీ చేపట్టనున్నారు.

మరోవైపు, పవన్‌ పర్యటనను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. పవన్‌కల్యాణ్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమలో పర్యటించే నైతిక హక్కు పవన్ కి లేదని విద్యార్థులు అంటున్నారు. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని పవన్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని ఆయన నేరుగా వ్యతిరేకించకున్నా.. రాజధానిలోనే హైకోర్టు ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ తాజా పర్యటనని రాయలసీమ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.