బీజేపీ పెద్దలతో పవన్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిలీ చాలా సీక్రెట్ గా కొనసాగుతోంది. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారు. ఎవరిని కలుస్తున్నారనే విషయాలేవీ బయటకు రాలేదు. ఐతే, తాజాగా పవన్‌ కల్యాణ్‌ బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో పవన్‌తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌, ఎంపీ తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు.

నడ్డాని కలిసిన తర్వాత పవన్‌ నేరుగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు బయల్దేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చినా… బీజేపీ పెద్దలు ఎవరితోనూ అపాయింట్‌మెంటు లభించకపోవడంతో చివరకు జేపీ నడ్డాను మాత్రమే ఆయన కలుసుకోగలిగారు. ఆదివారం పవన్ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలును కలిశారు. జనసేనని బీజేపీలో విలీనం వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది.