చేనేత యాప్ పై పవన్ కామెంట్స్

చేనేత కార్మికుల కోసం దినేష్, రామ్‌కల్యాణ్, అభిషేక్‌ల యాప్ ని రూపొందించారు. వారినిజనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. చేనేతలకు అండగా యాప్ రూపకర్తలకు పవన్ అభినందనలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టానికి ఫలితం దక్కేలా చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. నిజమైన నేతన్నలను, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.. యాప్ రూపొందించిన దినేష్, రామ్‌కల్యాణ్, అభిషేక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సృజనాత్మకమైన కళ అన్నారు పవన్.

ఇక దసరా కానుకగా వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఆశించారు. కానీ కొన్ని కారణాల వలన అది వాయిదా పడినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చాకే టీజర్ ని వదలాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది.