రాజధానిపై పవన్ స్పందన.. ఇది సమయం కాదు మిత్రమా !

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇది సమయం కాదు మిత్రమా అంటూ బహిరంగ లేఖను విడుదల చేశారు. ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి. మూడు రాజధానులకు ఇది సమయం కాదని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

గుజరాత్ రాజధాని గాంధీనగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని తన ప్రకటనలో పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని వైఎస్ జగన్.. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనన్నారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తామని.. రైతుల పక్షాన పోరాడుతామని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.