14న ఫెప్సీ ఎన్నికలు

ఈ నెల 14న దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెప్సీ)కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పెప్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి ప్రకటించారు. ఫెప్సీలో సుమారు 25 వేల మంది సభ్యులున్నారన్నారు. ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయన్నారు.

ప్రస్తుతం ఫెప్సీ అధ్యక్షుడుగా సెల్వమణి ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా అంగముత్తు షణ్ముగం ఉన్నారు. అయితే వీరి పదవికాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో 2021-23 సంవత్సరానికిగాను ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను ఈ నెల 7వ తేదీన వెల్లడించనున్నారు.

Spread the love