బాలీవుడ్ స్టార్లకి పెట్రో మంట

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై బాలీవుడ్ స్టార్స్ మౌనాన్ని ఉండటాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే ప్రశ్నించారు. రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలపై తమ వైఖరేంటో చెప్పాలని బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే వారు నటించిన సినిమాలు, షూటింగ్‌లను మహారాష్ట్రలో అనుమతించబోమని హెచ్చరించారు.

మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో బ్రాండెడ్‌ పెట్రోల్‌ ధర రూ100 మార్కును దాటేసింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.96.32లుగా ఉండగా.. డీజిల్‌ ధర రూ.87.32లుగా ఉంది. గత కొన్నాళ్లుగా ప్రతిరోజూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Spread the love