మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ఆ మధ్య పెట్రో ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతూ పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 48 తర్వాత ప్రెట్రో ధరలు మళ్లీ పెరిగాయ్. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 17 పైసలు పెరిగి 81.23ను చేరింది. డీజిల్‌ ధరలు సైతం లీటర్‌కు 22 పైసలు పెరిగి 70.68ను తాకింది. ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 87.92ను తాకింది.. డీజిల్‌ రూ. 77.11కు చేరింది.

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 84.31చేరగా.. డీజిల్ రూ. 76.17గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ. 82.79ను తాకింది.. డీజిల్‌ రూ. 74.24గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 22 పైసలు పెరిగి రూ. 85.47కు చేరింది. డీజిల్‌ ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడి రూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది.