‘ప్లాస్మా బ్యాంక్’ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కార్

కరోనా చికిత్సలో ప్లాస్మా తెరపి మంచి ఫలితాలనిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కోరల్లోంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి నుంచి ప్లాస్మాను సేకరించేందుకు ‘ప్లాస్మా బ్యాంక్‌’ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వచ్చే రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.

ఇప్పటి వరకు ఢిల్లీలో 29 మందికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. వారందరిలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చేందుకు స్వచ్చంధంగా రావాలని పిలుపునిచ్చారు. కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని ప్లాస్మా థెరపీలో సేకరిస్తారు. అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు. ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు.

Spread the love