బీహార్ ఎన్నికలు : ప్రధాని ప్రచారం షెడ్యూల్ విడుదల

బీహార్ ఎన్నికలకి సంబంధించి ప్రధాని ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదలైంది.ఈ షెడ్యూల్‌ను బీహార్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జీ దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు వెల్లడించారు. బీహార్‌లో మొత్తం 12 ప్రచార ర్యాలీల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని ఫడ్నవీస్ ప్రకటించారు.

ప్రధాని మోదీ అక్టోబర్ 23, అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో రోజుకు మూడు చొప్పున ర్యాలీల్లో పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 23న ససారాం, గయా, భాగల్‌పూర్ పట్టణాల్లో, అక్టోబర్ 28న దర్భంగా, ముజఫర్‌పూర్‌, పట్నా నగరాల్లో, నవంబర్ 1న చహప్రా, ఈస్ట్ చంపారన్‌, సమస్తిపూర్ జిల్లా కేంద్రాల్లో, నవంబర్ 3న పశ్చిమ చంపారన్‌, సహస్ర, అరేరియా జిల్లాల్లో ప్రధాని మోదీ ప్రచార ర్యాలీలు కొనసాగుతాయని ఫడ్నవీస్ చెప్పారు.