జమిలి ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై ఎలాంటి చర్చా అవసరం లేదని, అయితే దేశానికి మాత్రం అవి అత్యంత ఆవశ్యకమని నొక్కి వక్కానించారు.

“జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం. కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. ఈ సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం ఉంది” అన్నారు.

Spread the love