ప్రొడెక్షన్‌ మేనేజర్‌పై పోలీస్ కేసు

సినిమా ప్రొడెక్షన్‌ మేనేజర్‌పై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా షూటింగ్‌ చేస్తున్నందుకు కేసు నమోదు చేశారు. వనమాలీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఓ షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ శుక్రవారం ఉప్పల్‌లోని బ్యాంక్‌ కాలనీలో జరిగింది.

అయితే షూటింగ్‌ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొంటూ సదరు ప్రొడెక్షన్‌ మేనేజర్‌ జయంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కరోనా లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ సందడి మొదలవుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు సైతం సెట్స్ మీదకు వెళ్తున్నాయి.