సంజయ్ కోసం అఖండదీపం

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ లంగ్స్ క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స కోసం హుటాహుఠిన అమెరికా వెళ్లారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. తాజగా టీవీ నటి సంజయ్ కోసం అఖండదీపం వెలిగించింది.

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లో గ‌ణ‌ప‌తి పూజ‌లు నిర్వ‌హించారు. అదేవిధంగా టీవీ నటి కామ్యా పంజాబీ తమ‌ ఇంటిలో గణపతిని ప్ర‌తిష్టించి, పూజ‌లు చేసి, ఆ ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాలీవుడ్ హీరో సంజ‌య్‌ద‌త్ కోలుకోవాల‌ని ప్రార్థిస్తూ, వెలిగించిన అఖండ దీపానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.