పోస్టర్ విడుదల ఎప్పుడంటే ?

టి మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ‘పోస్టర్’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీ అయింది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ “ప్రతి ఇంట్లో జరిగే కథనే సినిమాగా తీశాను. ఈ కుటుంబ కథా చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాటలు విడుదల చేసి ఫిబ్రవరి నెలలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Spread the love