సినిమా వాళ్లని ఖుషి చేసిన కేసీఆర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోని విడుదల చేసింది. అన్ని వర్గాలని ఆకట్టుకొనే తెరాస మేనిఫెస్టో ఉంది. ఇందులో సినీ పరిశ్రమపై కూడా వరాలు కురిపించారు. కరోనా కాలానికి గానూ.. థియేటర్స్ కు కరెంట్ బిల్లులని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి.. ఈ హామీ గురించి థియేటర్స్ యాజమాన్యాలు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి థియేటర్స్ ఓపెన్ కి అనుమతులు లభించినా.. ఇంకా తెరవకపోవడానికి కారణం కూడా ఇదే. గ్రేటర్ ఎన్నికల వేళ సినిమా వాళ్లని కూడా సీఎం కేసీఆర్ ఖుషి చేశారు. ఇక రాబోయే కొద్ది రోజులు జీహెచ్‌ఎంసీకి సమగ్రమైన చట్టం తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పూర్తిస్థాయిలో అద్భుతంగా, అన్ని రకాల పారదర్శకంగా ఉండేలా, అవనీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం తేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు

Spread the love