షాకింగ్ సీన్స్ తో పవర్ స్టార్ ట్రైలర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసుకొస్తున్న మరో పైత్యం ‘పవర్ స్టార్’ సినిమా. ఈ వారమే విడుదల. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ముందుగా ఈ ట్రైలర్ ని రూ. 25కి అమ్మాలని వర్మ ట్రై చేసినా ముందే లీక్ కావడంతో ఫ్రీగా నే రిలీజ్ చేశారు. పవర్ స్టార్ చిత్రం ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందనే నేపథ్యంలో వర్మ తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది.

2019 ఎన్నికలలో వర్మ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాలలో ఓడిపోయారు. ఈ బాధని దిగమింగుకోలేక టీవీ ఎత్తేయడం, స్క్రిప్ట్‌ రాసి ఇచ్చిన ఓ దర్శకుడిని కొట్టడం, ఏపీ ప్రతిపక్ష నాయకుడితో వాగ్వాతం, అలాగే తన రష్యన్ భార్యతో ఉన్నప్పుడు తన రెండో భార్య ఫోన్ చేస్తే ఆమెపై విసుక్కోవడం, ఈ స్టార్ డం ఎవరి వలన వచ్చిందని ఓ వ్యక్తి ప్రశ్నించడం తదితర అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.