టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చెప్పేసిన బన్నీ !

టాలీవుడ్ టాప్ స్టార్ ఎవరు ? అనగానే.. మహేష్, ఎన్ టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. పేర్లు వినిపిస్తుంటాయి. ఒక్కరి పేరు చెప్పడంటే నోట మాట రాదు. కానీ, స్టయిలీష్ బన్నీ మాత్రం ఈతరం టాలీవుడ్ టాప్ హీరో బాహుబలి ప్రభాస్ అని తేల్చేశారు.  స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలు పంచుకొన్నారు.

టాలీవుడ్ లో ముగ్గురు ప్రధానమైన హీరోలు ఎవరు ? అన్న ప్రశ్నకి సమాధానంగా బన్నీ.. సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ పేర్లు చెప్పారు. ఈ తరం హీరోల్లో ప్రభాస్ పేరు చెప్పడం. అది కూడా బాహుబలి నుంచి అని ప్రస్తావించారు.