ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులిటెన్

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేశారు. అదే సమయంలో ప్రణబ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్‌ ముఖర్జీకి ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అలాగే, ఆయన కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు మెరుగుపడడం కోసం వైద్యం అందుతోందని చెప్పింది. ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది