మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రణయ్ నిందితుడు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తమను కాదని అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అతడిని హత్య చేయించాడు.

ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఎంఏ కరీం అనే వ్యక్తి ఒకరు. ప్రణయ్ హత్యకేసులో కరీం ఐదో నిందితుడు. ఇతడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకిదిగాడు. కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అతడు రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశాడు. కరీం గతంలో కాంగ్రెస్‌లో ఉండగా.. ఈ సారి పార్టీ బీ ఫారం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. మిర్యాలగుడలోని 20, 21 వార్డుల నుంచి అతను కౌన్సిలర్‌గా పోటీ చేయబోతున్నాడు.