రూపాయి ఫైన్.. ప్రశాంత్‌ భూషణ్ యూ-టర్న్ !

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు విధించిన రూపాయి జరిమానాను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం కోర్టు రిజిస్టరీకి చెల్లించారు. అలాగే కోర్టు ధిక్కరణ అంశంపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.

జరిమానా చెల్లించినంత మాత్రన తప్పు అంగీకరించినట్టు కాదన్నారు. సుప్రీంకోర్టుకు జరిమానా చెల్లించేందుకు తనకు దేశం నలుమూలల నుంచి నాణేలు వచ్చాయని చెప్పారు. అలా వచ్చిన మొత్తాన్ని ‘సత్య నిధి’ పేరిట ఉంచుతామని చెప్పారు. తనలా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసి ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొనే వారికి న్యాయ సాయంగా ఈ మొత్తాన్ని వినియోగిస్తామని చెప్పారు.