రాహుల్ గాంధీకి కృతజ్ఝతలు చెప్పిన పీకే

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలకి ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కృతజ్ఝతలు తెలిపారు. ఎన్నార్సీ, సీఏఏలను నిర్ద్వంద్వంగా తిరస్కరించినందుకు థ్యాంక్స్ అంటూ ప్రశాంత్ ట్వీట్ చేశారు. సీఏఏలని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయనని ప్రకటన చేయనని గతంలో ప్రశాంత్ కిషోర్ కోరిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్నార్సీ, సీఏఎ లను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ రాహుల్ కి థ్యాంక్స్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఏఎపై పార్లమెంటులో ఓటింగ్ జరిగినప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు దీన్ని సమర్థించిన విషయం గమనార్హం. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో అయోమయాన్ని రేపింది. రాష్ట్రంలో సీఏఎని అమలు చేస్తారా లేదా అన్న విషయమై ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నారు.