మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

మహారాష్ట్రలో మహమ్మారి కరోనా విజృంభిస్తోంది. దేశంలో అత్యధికంగా ఇక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

సోమవారం బీజేపీ నేత నారాయణ్ రాణే గవర్నర్‌ను కలుసుకున్నారు. కరోనాను కట్టడి చేయలేకపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ముంబై మాతోశ్రీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గంటన్నర పాటు చర్చలు జరిపారు.