ప్రైమ్ వీడియో.. పేరు మారింది !

అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏపీవీ) తన పేరు మార్చుకుంది. ‘Prime Video’లో ‘ME’ అక్షరాలను తొలగించింది. సోషల్ మీడియాలో ఈ సంస్థకు చెందినా ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ మార్పు చేసింది. అలాగే ఈ మార్పును ప్రస్తావిస్తూ #WhereIsME అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది ఏవీపీ సంస్థ. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దీన్ని ట్రెండ్ చేసింది.

హిట్ సినిమాల్లోని కొన్ని డైలాగులను తీసుకొని వాటిలో కూడా ‘ఎమ్‌ఈ’ కనిపించకుండా ఎడిట్ చేసి పోస్టులు పెట్టింది. ఈ కంపెనీ ఇలా ఎందుకు చేసిందో తెలియదుగానీ, దీన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ మాత్రం అసలేమయిందో తెలియక తికమక పడిపోతున్నారు. నిజంగానే ‘ఎమ్‌ఈ’ ఏమయ్యాయి? అని ప్రశ్నిస్తున్నారు. Pri అస్సలు బాగులేదని కామెంట్స్ పెడుతున్నారు.

Spread the love