నిందితులకి 14రోజుల రిమాండ్ 

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహశీల్దార్) 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్‌నగర్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అందుబాటులో లేక పోవడంతో పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నిందితులను తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచారు. విచారించిన తహసీల్దార్‌ నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

షాద్‌నగర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఉండడంతో నిందితులను పోలీసులు బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేనందున తహసీల్దార్‌ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.