జగన్ యేడాది పాలన (-) వంద మార్కులు !

ఏపీ సీఎం జగన్ వందరోజుల పాలనని పూర్తి చేసుకొన్నారు. సీఎం జగన్ వందరోజుల పాలనని వైసీపీ శ్రేణులు వంద మార్కులు వేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం నెగటివ్ మార్కులు వేస్తున్నాయి. సీఎం జగన్ ఏడాది పాలనపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నెర్రెడ్డి తులసిరెడ్డి స్పందించారు. జగన్ యేడాది పాలనకి వంద మార్కులు కాదు.. మైనస్ వందమార్కులు పడతాయన్నారు.

సీఎం పాలనకు వందకు వంద మార్కులు వచ్చాయని ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ‘కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లున్నాయి వారి వ్యాఖ్యలు. ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న నవరత్నాలకే దిక్కులేదు. కొన్నింటికి నాణ్యత లోపించింది. మరికొన్ని ఇప్పటికీ అమలేకాలేదు. ఇంకొన్నేమో గులకరాళ్లుగా రూపాంతరం చెందాయని విమర్శించారు.