పబ్జీతో పాటు 118 చైనా యాప్స్ బ్యాన్

భారత్ మరోసారి చైనాపై డిజిటల్ స్ట్రయిక్ చేసింది. పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మొబైల్ యాప్ లు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించాయంటూ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.

పబ్జీ, లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లు కేంద్రం విడుదల చేసిన నిషిద్ధ యాప్ ల జాబితాలో ఉన్నాయి. కేంద్రం ఇంతకుముందే టిక్ టాక్, హలో వంటి యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన భారత్ చైనాపై రెండోసారి డిజిటల్ స్ట్రయిక్ చేసినట్టయింది.