పబ్‌జీ ఈజ్ బ్యాక్.. కొత్త టీజర్ చూశారా ?

పబ్‌జీ గేమ్ తిరిగి భారత్ లోకి “పబ్‌జీ మొబైల్ ఇండియా” రాబోతున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.

భారతదేశం వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించడంతో పాటు దేశం వెలుపల ఉన్న సర్వర్లకు చేరవస్తున్నాయనే కారణంతో చైనాకు చెందిన పబ్‌జీ, 117 ఇతర చైనా యాప్స్ ను భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేదించింది. ఈసారి భారతదేశంలోని ఆటగాళ్ల గోప్యత, భద్రతను కాపాడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది పబ్‌జీ కార్పొరేషన్. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలోనే సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు.