బిగ్ బాస్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొంది. నాల్గో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టర్స్ గురించి లీకులు వస్తున్నాయ్. తీన్మార్ యాంకర్ బిత్తిరి సత్తి బిగ్ బాస్ 4లో పాల్గొనబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హోస్ట్ ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలాఉంటే తాజాగా బిగ్ బాస్ పై పునర్నవి స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పునర్నవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షో మొత్తం ఎడిట్‌ చేసి చూపిస్తారని, లోపల ఎం జరిగినా వారికి అవసరమున్నదే చూపిస్తారని, అది జనాలు నిజమే అనుకుంటారని చెప్పింది. కానీ తానేంటే తనకు మాత్రమే తెలుసని చెప్పింది. ప్రస్తుతం హౌజ్‌ మెంట్స్‌ అందరితో టచ్‌లో ఉన్నానని తెలిపింది.