పూరి మాట వినండి ప్లీజ్


“గ్లోబ‌ల్ వార్మింగ్‌, క్లైమేట్ చేంజ్‌, గ్రీన్ గ్యాసెస్.. ఇలాంటి మాట‌లు విన్న‌ప్పుడు 90 శాతం మ‌నం జోకులు వేస్తుంటాం. ప‌క్క‌నోడు ఎవ‌డైనా ఇలాంటి టాపిక్ ఎత్తినా ‘అబ్బా ఛా.. నీకెందుకురా?’ అని ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటాం. ఆస్ట్రేలియాలో రెండు నెల‌లు అడ‌వి త‌గ‌ల‌బ‌డుతున్నా మ‌నం ప‌ట్టించుకోం. 30 శాతం ఆక్సిజ‌న్ ఇచ్చే అమెజాన్ ఫారెస్ట్ త‌గ‌ల‌బ‌డుతున్నా ప‌ట్టించుకోం. ఆర్కిటిక్ ఐస్ క‌రిగిందంటే మ‌నం జోకులేస్తాం. కానీ క‌రోనా వ‌చ్చి ఇప్పుడు అంద‌రి చెంప‌లూ లాగి కొట్ట‌బోతోంది” అన్నారు దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌

ఆయన కరోనా పై ఒక వీడియోలో మాట్లాడారు. ”ఇప్పుడు మ‌న‌కు అన్నీ అర్థమ‌వుతాయ్‌. వియ్ ఆర్ ఆల్ క‌నెక్టెడ్ అనే విష‌యం తెలుస్తుంది. ఎక్కువ సంద‌ర్భాలు వైర‌స్‌ల‌న్నీ సిటీల‌లోనే పుడ‌తాయ్‌. అడ‌విలో పుట్ట‌వు. జ‌న‌భా వ‌ల్లే అవి న‌గ‌రాల్లో పుడ‌తాయ్‌. అడ‌విలో ఎందుకు పుట్ట‌వంటే, అక్క‌డి జంతువుల‌న్నీ ప్ర‌కృతిలో బ‌తుకుతాయి. మ‌నుషులు మాత్రం ప్ర‌కృతికి విరుద్ధంగా బ‌తుకుతారు. దాని వ‌ల్ల అన్ని వైర‌స్‌లూ పుడుతుంటాయ్‌. ఇదివ‌ర‌క‌టి వ్యాధుల‌తో పోలిస్తే క‌రోనా చావులు చాలా త‌క్కువ‌. ఇప్పుడు క‌నుక దాన్ని అదుపు చేయ‌క‌పోతే మ‌ర‌ణాల సంఖ్య రెండు రెట్లో, మూడు రెట్లో పెరుగుతుంది. క‌రోనాను కంట్రోల్ చెయ్యాలంటే క‌నీసం రెండు వారాల పాటు లాక్‌డౌన్ అవ‌స‌రం. . ద‌య‌చేసి ఆ ప‌ని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి” అని విజ్ఞ‌ప్తి చేశారు పూరి.