పీవీ మన తెలంగాణ ఠీవి

మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పీవి నరసింహారావుది 360 డిగ్రీల పర్సనాలిటీ. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయనకి అన్నిరంగాల్లో అనుభవం ఉంది. పీవీ ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ సంస్కరణలు చేసేవారు. రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు చేశారు. ఆయనకి 1000ఎకరాలు ఉంటే… ఓ 200 ఎకరాలు ఉంచుకొని మిగితా 800 ఎకరాలని పేదలకి పంచిన గొప్పనేత. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలని తీసుకొచ్చారని తెలిపారు.