రాజీనామాపై ఆర్ఆర్ఆర్ మరోసారి క్లారిటీ

వైసీబీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు (ఆర్ ఆర్ ఆర్) మరోసారి స్పష్టతనిచ్చారు. రాజీనామా చేయనుగాక చేయనని తేల్చి చెప్పారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే బటన్ నొక్కారు. అది ప్రజలకు తెలుసు. నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు తెలుసు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. వెనకడుగు వేశారు. ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి మీరే మూకుమ్మడిగా రాజీనామా చేయాలి.