సీఎం జగన్’కు లేఖ రాసిన రఘు రామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దూకుడు తగ్గించారు. తనకి సీఎం జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే చాలు.. అన్నీ సెట్ చేసుకుంటా అనే భావనకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ కి రాజు లేఖ రాశారు.

‘నేను వెంకటేశ్వరస్వామి అపర భక్తుణ్ని. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను వివరించా. ఈవ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు చెప్పా. నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. ఇసుక విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించా. ఈ ప్రయత్నం నెరవేరకే మరో మార్గం లేక మీడియా ముందుకు వెళ్లా. రాజ్యాంగానికి లోబడే నేను మాట్లాడా. మీపైనా, పార్టీపైనా నేనెక్కడా మాట్లాడలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది వారే.’ అని రఘురామ కృష్ణ రాజు లేఖలో పేర్కొన్నారు.