ఏపీ మంత్రులపై ఆర్ఆర్ఆర్ షాకింగ్ కామెంట్స్

ఏపీ మంత్రులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు మండిపడ్డారు. రైతుల టీషర్టుల గురించి మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వ్యవసాయం చేసేవారు బట్టలు లేకుండా తిరగాలనా అని ప్రశ్నించారు. వారి సొంత ఖర్చులతో విమానంలో ఢిల్లీ వచ్చి పోరాడుతుంటే… వాళ్లను చూసి కుళ్లుకోవడమెందుకన్నారు.

సీఎం జగన్‌ ప్రత్యేక విమానాల్లో తిరిగితే తప్పులేదు కానీ… అమరావతి రైతులు విమానాల్లో తిరిగితే తప్పా అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన తీరుకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ”మీ తండ్రులు, తాతలు ఏం చేశారో గుర్తు చేసుకుంటే… ఇలాంటి నీచమైన, కుసంస్కార మాటలు రావు. మంత్రులు పెద్ద తోపులు అనుకుంటున్నారు. వాళ్లను విమర్శిస్తే నాలుక చీరేస్తారట. ఎవరి నాలుకలు ఎవరు చీరేస్తారో ప్రజలు తేల్చుతారు” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.