లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం విఫలమైంది : రాహుల్

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. తొలి విడతగా 21రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తర్వాత దాన్ని పొడగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ 4.ఓ కొనసాగుతోంది. అయితే లాక్‌డౌన్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

మంగళవారం రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ ఉద్దేశం, లక్ష్యం నెరవేరలేదని ఆరోపించారు. వైరస్‌ తగ్గుముఖం పడుతుందని కేంద్రం చెబుతోంది… కానీ కేసులు ఇంకా పెరుగుతున్నాయన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే ..మరో వైపు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కరోనా వైరస్‌పై ఒంటరి పోరాటం చేశామన్నారు.