రాహుల్ సటైర్లు : పెట్రో ధరలని అన్ లాక్ చేశారు

దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ గా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. వరుసగా 18రోజు పెట్రో ధరలు పెరిగాయ్. ఈ క్రమంలో పెట్రోల్ ధరలని మించిపోయింది డీజిల్ రేటు. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడుకి మరింత భారం కానుంది. తాజాగా పెట్రో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.

‘మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని అన్ లాక్ చేయడంతో పాటు పెట్రో ధరలను కూడా అన్ లాక్ చేసింది.” అంటూ హిందీలో ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ఒక్కటే పెరుగుతున్నది కాదు” అంటూ లాక్‌డౌన్ తర్వాత పెట్రో ధరలు పెరిగిన విధానాన్ని ఓ గ్రాఫ్ ద్వారా రాహుల్ ట్వీట్ చేశారు.

Spread the love