హెచ్చరిక : హైదరాబాద్ లో భారీగా కురుస్తున్నవర్షం.. ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు !

హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయ్. ఈ నేపథ్యంలో ప్రజలని ప్రభుత్వం అలర్ట్ చేసింది. రానున్న 30 నిమిషాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. నగర ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని వెల్లడించింది.

వర్షాభావ ప్రాంతాల్లో ప్రభుత్వం బోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ తదితర బృందాలను లోకేష్ కుమార్ అప్రమత్తం చేశారు.